పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి - అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు... డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. కురుపాంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.5,733.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, చెక్‌డ్యాంలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో... వారికి కావాల్సిన కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులకు డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి శంకుస్థాపన