కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు. ప్రజలు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనాను తరిమికొట్టడంలో తమ వంతు పాత్రను పోషించాలని ఆమె కోరారు. జిల్లాలో కరోనా కంటోన్మెంట్ జోన్‌గా గుర్తించిన గరుగుబిల్లి మండల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి సందర్శించి అక్కడ కరోనా నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సూచనలు ఇచ్చారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఖచ్చితంగా సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సబ్ కలెక్టర్ అంబేద్కర్, గరుగుబిల్లి మండల అధికారులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ జోన్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన - Deputy Chief Minister who visited the Cantonment Zone
జిల్లాలో కరోనా కంటోన్మెంట్ జోన్‌గా గుర్తించిన గరుగుబిల్లి మండల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సందర్శించారు. అక్కడ కరోనా నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సూచనలు చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి