వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో.. మండల కేంద్రంలో ఉన్న వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలుచోట్ల నేతలు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు.
ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం.. కేక్ కట్ చేసిన ఉప ముఖ్యమంత్రి - ysrcp formation day in vizianagaram latest news
విజయనగరం జిల్లా కురుపాంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు.
![ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం.. కేక్ కట్ చేసిన ఉప ముఖ్యమంత్రి Deputy Chief Minister Pushpashree Vani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10976457-281-10976457-1615532353203.jpg)
కేక్ కట్ చేసిన ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి
గత పదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి.. పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడి సంక్షేమం కోసం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి..