ప్రజలకు వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. విద్యార్థులకు సైతం.. ఇళ్ల వద్దకే రేషన్ పంపిస్తున్నామని తెలిపారు. అనాథలకు తాత్కాలిక వసతి కల్పించి ఆదుకుంటున్నామన్నారు. పుష్పశ్రీవాణి స్వగ్రామమైన విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చిన్నమేరంగిలో.. ఆమెతోపాటు వైకాపా పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు దంపతులు రెండు వందల మందికి భోజనాలు వండి.. గ్రామంలో అందించారు. లాక్డౌన్కు సహకరించి... కరోనాను తరిమి కొట్టేందుకు ప్రజలు సహకరించాలని ఉపముఖ్యమంత్రి కోరారు.
రెండొందల మందికి భోజనం వండిన ఉపముఖ్యమంత్రి - కరోనా చర్యలపై ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్ న్యూస్
రాష్ట్రంలో పేద ప్రజలెవరూ పస్తులు ఉండకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆపద సమయంలో ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.

రెండొందల మందికి భోజనం వండిన ఉపముఖ్యమంత్రి