ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రికి, సామాన్య మానవుడికి వారధి.. వాలంటీర్లే' - వాలంటీర్లను సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తాజా వార్తలు

కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజల్లో మమేకమై.. నిరంతరం ప్రభుత్వ అభివృధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నది వాలంటీర్లేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ప్రశంసించారు. కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మి పురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు సంబంధించిన గ్రామ సచివాలయ వాలంటీర్లకు మండల కేంద్రంలో ఉన్న మైదానంలో సత్కార సభ నిర్వహించారు.

Deputy Chief Minister Pamula Pushpashree Vani
వాలంటీర్లను సత్కరించిన ఉప ముఖ్యమంత్రి

By

Published : Apr 14, 2021, 4:53 PM IST

ప్రజల కష్టసుఖల్లో పాలుపంచుకునే వాలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి పేర్కొన్నారు. కురుపాం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గంలో పనిచేస్తున్న వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె... సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి ప్రజలకు ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి సామాన్య మానవుడికి వారధి వాలంటీర్లేనని కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details