ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగాపురం విమానాశ్రయ పనులపై అధికారుల సమీక్ష

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పర్యటించిన మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికల్ వలవన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని... భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

Department of Infrastructure Investment Special Secretary Karikal Valavan meeting in bhogapuram airport
విమానాశ్రయానికి కేటాయించిన ప్రాంతాన్ని పటంలో పరిశీలిస్తున్న ప్రత్యేక కార్యదర్శి కరికల్‌ వలవన్‌

By

Published : Jan 9, 2020, 1:20 PM IST

విమానాశ్రయానికి కేటాయించిన ప్రాంతాన్ని పటంలో పరిశీలిస్తున్న ప్రత్యేక కార్యదర్శి కరికల్‌ వలవన్‌
ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, భూసేకరణ పూర్తై వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికల్‌ వలవన్‌ అన్నారు. బుధవారం భోగాపురం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి ప్రతిపాదించిన రావివలస ప్రాంతంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టరు హరిజవహర్‌లాల్‌, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ సీఈవో మీనాశర్మ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. గతంలో 5,311 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశారని, ఇందులో 2624 ఎకరాలు మాత్రమే అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఇప్పటికే 90శాతం మేర భూసేకరణ పూర్తయిందని, మరో 250 ఎకరాలు సేకరించాల్సి ఉందని వివరించారు. కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, వీరూ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. పోలిపల్లి, గూడెపువలస ప్రాంతాల్లో 51ఎకరాల భూమిని సేకరించి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయరహదారి నుంచి అనుసంధాన రహదారి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. విమానాశ్రయ ప్రతిపాదిత భూములను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జీసీహెచ్‌.కిశోర్‌కుమార్‌, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉపకలెక్టరు కె.బాలాత్రిపుర సుందరి, సీహెచ్‌.రామకృష్ణ, ఆర్డీవో హేమలత, సందీప్‌, తహసీల్దారు అప్పలనాయుడు, సర్వేయరు రాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details