విజయనగరం జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని.. ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. లోకసత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చేపట్టిన ఈ దీక్షకు పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. వ్యాధితో బాధపడుతూ పలువురు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని బీశెట్టి బాబ్జి కోరారు.
'క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి' - cancer hospital latest news
విజయనగరం జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని లోక్సత్తా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనకు పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
ఆందోళన