విజయనగరంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకుడు భీశెట్టి బాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఇతర ప్రజా సంఘాలతో కలసి.. క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితిని ఏర్పాటు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రతియేటా వందల్లో క్యాన్సర్ రోగుల సంఖ్య నమోదవుతోందన్నారు. ప్రధానంగా గిరిజనులు అధికంగా వ్యాధి బారినపడుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా ప్రభుత్వ క్యాన్సర్ వైద్యశాల లేకపోటవటంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.
క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఏర్పాటు: లోక్ సత్తా పార్టీ నేత - విజయనగరంలో క్యాన్సర్ ఆసుపత్రికి డిమాండ్
విజయనగరంలో ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకుడు భీశెట్టి బాబ్జీ ప్రభుత్వాాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రజా సంఘాలతో కలసి సాధన సమితిని ఏర్పాటు చేశారు.

Breaking News
విశాఖలో ఇప్పటికే రెండు క్యాన్సర్ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. ఇటీవల ప్రభుత్వం మరొకటి మంజురు చేసిందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఒక ఆసుపత్రి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోకపోవడం విచారకమన్నారు. విజయనగరంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరుకు డిమాండ్ చేసేందుకు.. ప్రజా సంఘాలతో కలసి సాధన సమితిగా ఏర్పడినట్టు భీశెట్టి బాబ్జీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్..