గుమ్మలక్ష్మీపురంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య - గుమ్మలక్ష్మీపురంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీ పురం మండలం ఎస్.కె పాడు గ్రామంలో డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి మృతురాలి తల్లి, తమ్ముడుతో కలిసి సమీపంలో ఉన్న గుమ్మ జాతరకి వెళ్లి ఇంటికి వచ్చింది. బహిర్భూమికి వెళ్తానని చెప్పి తన ఇంటి పెరటిలో వాంతులు చేసుకోవడం తల్లి గుర్తించింది. కుమార్తె పురుగులు మందు తాగినట్లు గ్రహించి వైద్యం కోసం భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించింది. ఉన్నత వైద్యం కోసం పార్వతీపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
గుమ్మలక్ష్మీపురంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
TAGGED:
VIDHYARDHINI ATMAHATYA..