ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూతురే కొడుకై... తండ్రికి తలకొరివి - vizianagaram news

కరోనా మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించింది ఓ యువతి. తండ్రి ఒడిలో పెరిగిన, ఆడి పాడిన ఆమె.. ఆ బాధను దిగమింగుకుంటూనే అంత్యక్రియలు నిర్వహించింది.

daughter did last rituals of father at vizianagaram
daughter did last rituals of father at vizianagaram

By

Published : Jun 16, 2021, 4:32 PM IST

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మంటకలుపుతున్న ఈ రోజుల్లో.. తండ్రి దహన సంస్కారాలు నిర్వహించి ఆయన రుణం తీర్చుకుంది ఓ యువతి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురంలో కరోనా మహమ్మారితో పోరాడి గుడ్ల శ్రీనివాసరావు(55) మృతి చెందాడు. ఆయన పెద్ద కుమార్తె మృదుల అతని అంత్యక్రియలు నిర్వహించింది.

గత కొన్ని రోజులుగా కరోనాతో శ్రీకాకుళంలోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. శ్రీనివాసరావుకు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో పెద్ద కుమార్తె కొడుకై తండ్రికి తలకొరివి పెట్టింది. గుండెలనిండా తండ్రిని కోల్పోయిన బాధ కలచివేస్తున్నప్పటికీ.. కుటుంబసభ్యుల రోదనల మధ్య తండ్రి చితికి నిప్పంటించింది.

ABOUT THE AUTHOR

...view details