విజయనగరం జిల్లా ఏంవలస మండలం గడ్డ తిరువాడ గ్రామంలో తండ్రి, కుమార్తె ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన బి. వెంకటరమణ దంపతులు గొడవపడ్డారు. వెంకటరమణ మనస్థాపంతో పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. తండ్రి విషం తాగాడని ఆయన కుమార్తె ఇంటి వద్ద ఫినాయిల్ తాగింది. కుటుంబీకులు గమనించి బాధితులను చినమేరంగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి పంపించారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తండ్రి పురుగుల మందు తాగాడని..కుమార్తె ఆత్మహత్యాయత్నం - గడ్డతిరువాడ నేర వార్తలు
తండ్రి పురుగుల మందు తాగాడని ఓ కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గడ్డతిరువాడ గ్రామంలో జరిగింది. తండ్రీకూతుళ్లకు చికిిత్స అందిస్తున్నారు.
గడ్డతిరువాడలో తండ్రి కూతురు ఆత్మహత్యయత్నం