ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ అందటం లేదని దారపర్తి గిరిజనుల ఆందోళన - దారపర్తిలో గిరిజనులు ఆందోళన

రెండు నెలలుగా రేషన్ అందటం లేదని.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి ప్రజలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు.. సకాలంలో గిరిజనులకు రేషన్ అందేలా చర్యలు చేపడతామని తెలపటంతో ఆందోళన విరమించారు.

daraparthi tribals protest for not getting ration since two months
రేషన్ అందటం లేదని దారపర్తి గిరిజనుల ఆందోళన

By

Published : Mar 6, 2021, 5:01 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిజనులు ఆందోళన బాట పట్టారు. గ్రామానికి రెండు నెలల నుంచి రేషన్ సరకులు అందటం లేదని, సరైన రోడ్డు లేకపోవటమే ఇందుకు కారణమని.. స్థానికులు తెలిపారు. గిరిజనులు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ మండల కేంద్రానికి చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు.

దారపర్తి గిరిజన పంచాయతీ కొండల మధ్య ఉంటుంది. మండల కేంద్రానికి రావాలంటే సుమారు 20 కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి. ప్రతి నెల గిరిజనులు రేషన్ సరుకుల కోసం 15 కిలోమీటర్లు వచ్చి.. దబ్బగుంట గ్రామంలో సరుకులు తీసుకునేవారు. ఇంటింటికి రేషన్ సరుకులు పథకం పెట్టాక.. గిరిజనులకు ఆ కష్టం తీరిందనుకున్నారు. కానీ, అసలు రేషనే అందటం లేదని వారు వాపోయారు.

శృంగవరపుకోట వద్దనున్న దేవి ఆలయ కూడలిలో రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవటంతో.. కొందరిని పోలీస్ స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు.. గిరిజనులకు సకారంలో రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

విజయవాడ తెదేపాలో భగ్గుమన్న విభేదాలు

ABOUT THE AUTHOR

...view details