ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 10:42 PM IST

ETV Bharat / state

'ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భాజపా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ మండిపడ్డారు. ఈ దాడులపై స్వయాన రాష్ట్రపతి స్పందించటం తీవ్రతకు నిదర్శనమన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Dalit Morcha State President Devanand Tour In Vizianagaram
'ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'

రాష్ట్రంలో దళితులపై దాడులే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ ఆరోపించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం విచ్చేసిన ఆయన... భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గంపెడాశలు పెట్టుకున్న పేద ప్రజలకు అన్యాయం చేయటమే కాకుండా.. అణగారిన వర్గాలపై దాడులకు పాల్పడటం హేమమైన చర్యని అన్నారు. ఈ దాడులపై స్వయాన రాష్ట్రపతి స్పందించటం... తీవ్రతకు నిదర్శనమన్నారు. ఇతర పార్టీలను భయబ్రాంతులకు గురి చేసేందుకు ఆ పార్టీల నేతలను లొంగదీసుకునే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని దేవానంద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన తన తీరు మార్చుకోక పోతే.. భాజపా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details