ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సీలపై దాడులను అరికట్టాలి.. వారి భూములను పరిరక్షించాలి' - విజయనగరంలో దళిత సంఘాల ఆందోళన

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. అంబేడ్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో బహుజన సంఘాలు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టాయి. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని సంఘ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా దాడులను అరికట్టి.. వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

dalit community protest in vizianagaram
దళిత సంఘాల ఆందోళన

By

Published : Aug 31, 2020, 6:44 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. అంబేడ్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో బహుజన సంఘాలు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టాయి. పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. ఆయా సంఘాల కళాకారులు డప్పులు, డోలు వాయిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్న వరుస దాడులను సంఘ సభ్యులు ఖండించారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. నిందితులపై ప్రభుత్వ చర్యలు కొరవడటం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఎస్సీ వర్గాలవారిపై దాడులు చేయడమే కాక.. వారి భూములను అక్రమంగా లాగేసుకుంటున్నారని విమర్శించారు. వీటిపై ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారన్నారు. ఇప్పటికైనా దాడులను అరికట్టి.. వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details