విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ నెట్ సెంటర్లో అనుమతి లేకుండా రైల్వే తత్కాల్ సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని.. విశాఖ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు. గతంలో ఉన్న అనుమతి గడువు ముగిసినా పునరుద్ధరణ చేసుకోకుండా... టిక్కెట్లను రిజర్వ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులకు తెలియడంపై దాడులు నిర్హహించారు. సీఐ మనోజ్ కుమార్, ఎస్సై శ్రీనివాసరావు ఇ -నెట్ సెంటర్ నిర్వాహకుని పట్టుకున్నారు. తత్కాల్ సాధారణ టికెట్లను,సెల్ ఫోన్, కంప్యూర్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
అనుమతి లేకుండా తత్కాల్ టికెట్ల బుకింగ్.. ఇ-నెట్ సెంటర్ సీజ్ - paravathipuram
రైల్వే అనుమతులు లేకుండా తత్కాల్ సాధారణ రిజర్వేషన్ టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని రైల్వే క్రైం ఇంటలిజెన్స్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు.
cyber crime police seized at e net center in paravathipuram at vizianagaram district