విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాత బస్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన చరవాణి విక్రయ కేంద్రం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. తమ దుకాణానికి వచ్చిన తొలి వంద మంది కొనుగోలుదారులకు 600 రూపాయల విలువైన చరవాణిని 199 రూపాయలకే అందిస్తామని ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. ఉదయమే ఆఫర్ ఫోన్ కోసం బారులు తీరారు. చరవాణి విక్రయాలు ప్రారంభమయ్యే సరికి రద్దీ ఎక్కువైంది. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
బంపర్ ఆఫర్... 199 రూపాయలకే చరవాణి - parvatipuram
పార్వతీపురంలో ఓ చరవాణి విక్రయ కేంద్రం యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తొలి 100 మంది కొనుగోలుదారులకు 199 రూపాయలకే చరవాణి ఇస్తామని తెలిపాడు.

ఆఫర్
బంపర్ ఆఫర్... 199 రూపాయలకే చరవాణి
ఇది కూడా చదవండి.