విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కేకే రైల్వే లైన్లో విద్యుత్ లైను మరమ్మతు పనులు చేస్తుండగా ఓహెచ్సీ విభాగం ఉద్యోగి వెంకట్రావు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించి విశాఖపట్నం రైల్వే ఆసుపత్రికి పంపించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాతే పనులు చేస్తున్నామని.. అయినా షాక్ కొట్టిందని సిబ్బంది చెప్పారు.