ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో సారస్వత భజన.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు - vizainagaram latest updates

విజయనగరం జిల్లా సాలూరులో హిందూస్థానీ శాస్త్రీయ గాయకురాలు మహువనంది పలు గీతాలు ఆలపించి సంగీత అభిమానులు ఆకట్టుకున్నారు.

పుస్తకావిష్కరణ  చేస్తున్న మాజీ ఎమ్మెల్యే
పుస్తకావిష్కరణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

By

Published : Jan 25, 2021, 10:54 AM IST

సాలూరులో సాహితీ మిత్రబృందం ఆధ్వర్యంలో సారస్వత భజన కార్యక్రమం నిర్వహించారు. హిందుస్థానీ సంగీత కళాకారిణి మహువనంది ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కోలగట్ల లక్ష్మీ పవిత్ర చేసిన నృత్య ప్రదర్శన.. మైమరపించింది. కవి తిరుమలరావు రచించిన అక్షరకాంక్ష పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్.పి బంజుదేవ్, డాక్టర్ వి. గణేశ్వరరావు, జార్జపు ఈశ్వరరావు మిత్ర బృందం సభ్యులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో కథల పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో ప్రథమ బహుమతి హైదరాబాద్​కు చెందిన శ్రీ తులసి బాలకృష్ణ గెలుపొందగా ద్వితీయ బహుమతి ఈనాడు అంతర్యామి రచయిత శ్రీ ఆనంద్ సాయి స్వామి గారికి లభించింది.

ABOUT THE AUTHOR

...view details