విజయనగరం జిల్లా సాలూరు మండలం తోనాం నుంచి దిగువ మెండింగి ,శిఖ పరువు , మావుడి, బూర్జి ,పగుల చేన్నారు, పట్టు చన్నారు గ్రామాలకు వెళ్లే మార్గంలో గోముఖి నదికి ఆనుకొని ఉన్న బ్రిడ్జి ఇటీవల గులాబ్ తుపాను దాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం నాడు సంత జరిగింది. ఎప్పటిలాగే పలు గ్రామాలకు చెందిన గిరిజనులు సంతకు వచ్చారు. రహదారి లేకపోవడంతో ఓ వెదురు కర్ర ఆసరాగా చేసుకొని దిగి సంతలోకి వెళ్లారు. వెళ్లేటప్పుడు కూడా ఆ వెదురు కర్రనే నిచ్చెనగా ఉపయోగించుకొని తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
తెగిన వంతెన.. వెదురు కర్రె వారధిగా...
గోముఖి నదికి ఆనుకొని ఉన్న బ్రిడ్జి ఇటీవల గులాబ్ తుపాను ప్రభావంతో కొట్టుకుపోయింది. ఫలితంగా తోనాంకు రావడానికి దారి లేకుండా పోయింది. శనివారం అక్కడ సంత ఉండడంతో..పక్క గ్రామాల ప్రజలు కర్రల సాయంతో నదిని దాటి సంతకు వచ్చారు.
కర్ర సాయంతో నదిని దాడుతున్న ప్రజలు