విజయనగరం జిల్లాలో ఫొని బీభత్సం... పంట నష్టం - ఫొని తుపాను
విజయనగరం జిల్లాకు ఫొని తుపాను ముప్పు తప్పింది. కానీ తుపాను ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలతో పాటు... ఉద్యాన పంటలైన మామిడి, అరటి, బొప్పాయి, కొబ్బరి రైతులకు నష్టం వాటిల్లింది.
విజయనగరం జిల్లాలో ఫొని బీభత్సం
పంట చేతికొచ్చే సమయంలో ఈదురుగాలులు వీరుచుకుపడటంతో... రైతులు నష్టపోయారు. డెంకాడ మండలంలో ఎక్కువగా వరి పంట నేలవాలగా... చీపురుపల్లి, పూసపాటిరేగ మండలాల్లో అరటిపంట దెబ్బతింది. పూసపాటిరేగ, డెంకాడ, గుర్ల, గరివిడిలో మొక్కజొన్న పంట దెబ్బతినగా... పలు మండలాల్లో మామిడి రైతులు నష్టపోయారు. ఫొని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో వాటిల్లిన పంటనష్టంపై మరిన్ని వివరాలు ఈ వీడియోలో...