విజయనగరం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పట్టణంలో కరోనా టెస్టులు చేయడం లేదని.. పాజిటివ్ వచ్చిన చోట మాత్రమే పరీక్షలు చేస్తున్నారని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లాలో కరోనా పరీక్షలు చేయాలని.. హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఆహారం కోసం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేయడానికి విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటికీ శానిటైజర్ లు పంపిణీ చేయాలని చెప్పారు.