ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సీపీఎం విజయనగరం జిల్లా నాయుకులు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులకు గురైన ప్రజలపై పన్నుల రూపంలో మరింత భారం మోపేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని సీపీఎం నాయకులు శంకర్ రెడ్డి హెచ్చరించారు.
'ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి' - cpm latest news
నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించింది. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి
TAGGED:
విజయనగరం జిల్లా తాజా వార్తలు