ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CPM Madhu: 'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం' - కరోనా కట్టడిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం న్యూస్

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్లు, మందుల కొరత కారణంగా ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

cpm madhu fire on state and central governments over corona second wave
కరోనా కట్టడిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

By

Published : Jun 20, 2021, 9:34 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. వియనగరం జిల్లా కరకవలస డీఈడీ కళాశాలలో గురజాడ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్లు, మందుల కొరత కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రతినెల రూ. 7,500 ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు టీచర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నట్లే..ఏపీలోనూ వారికి ఆర్థికంగా సాయం చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details