కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా.. విజయనగరం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద సీపీఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య భేరిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మోదీ సర్కారుకు తెదేపా, వైకాపా, జనసేన వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు.
విజయనగరంలో సీపీఎం ప్రజా చైతన్య భేరి
ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ప్రజా చైతన్య భేరిని విజయనగరంలో సీపీఎం ప్రారంభించింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు.. రాష్ట్రంలోని పార్టీలు మద్ధతివ్వడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా.. దేశంలో అన్ని వర్గాల వారికి నష్టం కలిగించే విధానాలను అనుసరిస్తోందని సీపీఎం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. వ్యవసాయ, కార్మిక వర్గాలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భాజపాకు మద్ధతు పలకడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. వారం రోజులపాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:విజయనగరంలో వైఎస్సార్ బీమా పథకం అమలుపై కలెక్టర్ సమావేశం