పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయనగరంలో సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కోట జంక్షన్ వద్ద సంబంధిత జీవో కాపీలను చించి నిరసన తెలిపారు. ఇప్పటికే ప్రజలు ఇబ్బందు పడుతున్నారని, ఆస్తి పన్ను పెంచడం మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను పెంపు జీవోను రద్దు చేయాలి' - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం కోట జంక్షన్ వద్ద సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నును పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలకు అదనపు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఆస్తి పన్ను పెంపు జీవోను రద్దు చేయాలి