ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 8:31 PM IST

ETV Bharat / state

మహారాజ కళాశాలపై ప్రభుత్వ తీరు సరికాదు: సీపీఎం

విజయనగరం జిల్లాలోని మహారాజ కళాశాల ప్రవేశాల అనుమతులపై మంత్రి బొత్స చేసిన ప్రకటనను... సీపీఎం నేత కృష్ణమూర్తి ఖండించారు. మహారాజ కళాశాలను ఈ స్థితికి తీసుకురావటం దారుణమన్నారు.

cpm leader krishnamurthy fires on minister botsa satyanarayana about maharaja college admissions issue at vizianagaram
మహారాజ కళాశాలపై ప్రభుత్వ తీరు సరికాదు: సీపీయం

విజయనగరం జిల్లాలోని మహారాజ కళాశాల ప్రవేశాల అనుమతులపై మంత్రి బొత్స చేసిన ప్రకటనను సీపీయం పార్టీ నేత కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చెప్పకుండా అడ్మిషన్లు నిలిపివేయడం మూర్ఖపు చర్య అంటూ ధ్వజమెత్తారు.

ఈ సంవత్సరం అడ్మిషన్లు ఆపేస్తే రెండో సంవత్సరానికి విద్యార్థులు ఉండరని, ఆ తర్వాత మూడో సంవత్సరానికి విద్యార్థులు ఉండరని, చివరికి ఎంఆర్ కాలేజ్ ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర ఉన్న మహారాజ కళాశాలను ఈ స్థితికి తీసుకురావటం దారుణమన్నారు. కళాశాలను కాపాడుకునేందుకు విద్యార్థులు, స్థానికులు, మేధావులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details