ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షపు నీటిలో ఈత కొట్టి.. చేపలు పట్టి.. మొక్కలు నాటారు! - CPM innovative protest to make repairs to interstate highway

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా పాడైందని …వెంటనే మరమ్మత్తులు చేయాలని సీపీఎం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

CPM innovative protest to make repairs to interstate highway
అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మత్తులు చేయాలని సిపిఎం వినూత్న నిరసన

By

Published : Sep 8, 2020, 3:45 PM IST

గుమ్మడ గ్రామ సమీపంలోని అంతర్ రాష్ట్ర రహదారి చెడిపోయింది. ఆ మార్గంలో వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఎం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా రాయగడ వెళ్లే దారిలో కొమరాడ మండలంలో దారి పూర్తిగా పాడైందని నాయకులు తెలిపారు.

రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడిన కారణంగా.. వాహనచోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో చేరిన నీటిలో మొక్కలు నాటడం.. చేపలు పట్టడం.. గూడ తో నీరు తోడటం.. ఈత కొట్టడం వంటి పనులు చేస్తూ సీపీఎం, రైతు కూలీ సంఘం నాయకులు నిరసన తెలిపారు సంబంధిత అధికారులు తక్షణం రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details