కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన - Vizianagaram district latest news
కరోనా ఇబ్బందుల్లో నుంచి సామాన్య ప్రజలు ఇంకా బయటపడలేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరల పెంచడం దారుణమని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆందోళన చేశారు. స్థానిక గంటస్తంభం జంక్షన్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేశారు.
![కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన ప్రజలపై ఆర్థికభారాలు మోపుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9749335-394-9749335-1606989791732.jpg)
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావంతో జీవనోపాధి లేక సామాన్యులు అల్లాడిపోతున్నారని.. నిత్యావసరాలు కొనుగొలు చేసేందుకు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ధరలు పెంచటం దారుణమని సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా విజయనగరంలోని గంట స్తంభం జంక్షన్లో గ్యాస్ బండలతో ఆందోళనలు చేశారు. గ్యాస్, పెట్రోల్, ఆయిల్ మొదలైన నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడు వంట గ్యాస్ సిలండర్పై రూ.50 పెంచటం దారుణన్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ఇవీ చదవండి