విజయనగరం జిల్లాలో..
పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ పార్వతీపురంలో సీపీఐ, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షతన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆటోను తాడుతో కట్టి లాగుతూ నిరసన తెలిపారు. అంతర్జాతీయ విపణిలో ఇంధన ధరలు తగ్గుతుంటే మన దేశంలో రోజూ రేటును పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని సీఐటీయూ నాయకులు అన్నారు.
విశాఖ జిల్లాలో..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మరింత భారాన్ని ప్రజలపై వేయడం ప్రభుత్వానికి తగదన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు భద్రం, లక్ష్మణ్, శంకర్ రావు, మల్లికార్జున రావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో..