ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విజయనగరం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలి' - విజయనగరం సీపీఐ నేతలు న్యూస్

వర్షాభావ పరిస్థితుల కారణంగా విజయనగం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సీపీఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

cpi leaders
సీపీఐ నేతలు

By

Published : Sep 12, 2020, 9:58 AM IST

విజయనగరం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి.. రైతులను తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్​ఛార్జ్ అశోక్ డిమాండ్ చేశారు. జరజారావుపేట, కొండవెలగాడ, కొండ గుంపాం, అలుగోలు గ్రామాల్లో వరి నాట్లు పరిశీలించారు.

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా.. పంటలు పండక.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పొలాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించి.. అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details