జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా సీపీఐ నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మి అప్పలరాజు దొర, జిల్లా సమితి సభ్యులు టి.జీవన్ తదితరులు కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను కలిశారు. జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై, పట్టణంలో మూడు లాంతర్ల కూల్చివేతపై, వలస కూలీల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.
'విజయనగరం జిల్లాలో సమస్యలు పరిష్కరించాలి' - విజయనగరం జిల్లాలో సీపీఐ నాయకులు తాజా వార్తలు
జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా సీపీఐ నాయకులు కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను కలిసి విన్నవించారు. పట్టణంలో పురాతన కట్టడాలను కూల్చివేయడం, ఉపాధి కూలీల పని వేళల మార్పు, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

కలెక్టర్‌ను కలిసిన సీపీఐ నాయకులు
వందల ఏళ్లుగా ఉన్న చారిత్రక చిహ్నం మూడు లాంతర్లను అభివృద్ధి పేరుతో పురావస్తు శాఖ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు కూల్చడం సరికాదన్నారు. గతంలో ఉన్నట్టుగా అదే చిహ్నాన్ని తిరిగి నిర్మించాలని అన్నారు. వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం వలన ఉపాధి పనులు సంబంధించి ఉదయం 6 గంటలకే ప్రారంభించి 10 గంటలకే పని ముగించాలని కోరారు.
ఇవీ చూడండి..