ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ - మజగ
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు నామినేషన్ వేశారు. జనసేనాని పవన్ ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యమన్నారు.
ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామేశ్వరరావు నామినేషన్ వేశారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ స్థానానికి జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని కామేశ్వరరాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐని గెలిపించాలని కోరారు. కంకి కొడవలి గుర్తుకు ఓటేయ్యాలన్నారు.