ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ప్రజలు రాక వెలవెలబోతున్న వ్యాక్సిన్ కేంద్రాలు - వెలవెలబోతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు

తెల్లవారేసరికి వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు ప్రజల పరుగులు. ఎక్కడ చూసినా చాంతాండంత పొడవున బారులు. గంటల తరబడి క్యూలో ఉన్నా వ్యాక్సిన్ అందుతుందో లేదో అనే అనుమానం. ఎంతో మంది నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. విజయనగరం జిల్లాలో కరోనా టీకా పంపిణీ కేంద్రాల వద్ద మొన్నటి వరకు నెలకొన్న పరిస్థితి ఇది. కానీ ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఐదారు మందికి మించి ఎవరూ కనిపించడం లేదు. ఆయా కేంద్రాలకు అంతంత మాత్రంగానే కేటాయించిన డోసులు సైతం మిగులిపోతున్నాయి.

vaccination centers in vizianagaram
విజయనగరంలో వ్యాక్సినేషన్ కేంద్రాల పరిస్థితి

By

Published : May 15, 2021, 4:23 PM IST

వెలవెలబోతున్న టీకా కేంద్రాలు

విజయనగరం జిల్లాలో కొవిషీల్డ్​తో పాటు కొవాగ్జిన్ టీకా సైతం ప్రజలకు అందిస్తున్నారు. కొవాగ్జిన్ రెండో డోసు కోసం జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలను.. కొవిషీల్డ్ కోసం 43 కేంద్రాలను వివిధ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచింది. కొవిషిల్డ్​కు 12 -16 వారాలు, కొవాగ్జిన్​కు 4 వారాలు దాటితేనే మరో డోసు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కొవిన్ వెబ్ సాఫ్ట్​వేర్​లో సైతం మార్పులు చేశారు. తాజా నిబంధన మేరకు.. జిల్లా వ్యాప్తంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:11అడుగుల భారీ కోబ్రాకు శస్త్రచికిత్స

కొవిషీల్డ్ వేసుకొని 84 రోజులు, కొవాగ్జిన్ వేసుకొని 28 రోజులు దాటిన వారికి మాత్రమే కొవిన్ వెబ్​సైట్​లో పేర్లు నమోదుకు అవకాశం కల్పించడంతో.. జిల్లాలోని వ్యాక్సినేషన్ కేంద్రాలు బోసిపోతున్నాయి. మారిన నిబంధనల మేరకు అర్హత ఉన్న ఒకరిద్దరు మాత్రమే టీకా కేంద్రాలకు వస్తున్నారు. వైబ్​సైట్​లో జరిగిన మార్పులే ఈ పరిస్థితులకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి డోసుకు అవకాశం ఇస్తే.. సమయం వృథా కాకుండా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

భయమే శత్రువు.. కోలుకోవడానికి మనోస్థైర్యమే మందు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details