విజయనగరం జిల్లా బొబ్బిలి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అధికారులు కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఐదు మండలాలకు చెందిన రోగులను ఇందులో చేర్చి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేశారు. ఈ కేంద్రంలో తాగునీటికి, విద్యుత్ కి తరుచూ అంతరాయం ఏర్పడుతుండడంపై... కొవిడ్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.
కొవిడ్ కేర్ కేంద్రంలో 70 మంది రోగులు ఉన్నారు. మూడు పూటలా పౌష్టికాహారం అందిస్తున్నా... భవనంలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. వారి బంధువులు సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తహసీల్దార్ సాయికృష్ణ అన్నారు. ఎక్కడ మరమ్మత్తులు ఉన్నాయో గుర్తించి... బాగు చేయిస్తామని చెప్పారు.