విజయనగరం జిల్లా బొబ్బిలి కొవిడ్ కేర్ కేంద్రంలో కరోనా రోగులు ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. వారికి సోకిన వ్యాధిని మరిచి ఉల్లాసంగా సేద దీరుతున్నారు. చదరంగం, వాలీబాల్, షటిల్ తదితర క్రీడల్లో రోగులు బిజీగా గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ఇలా ఆటల్లో తలమునకలయ్యారు. వారికి కావాల్సిన క్రీడా సామాగ్రిని అధికారులు సమకూర్చారు. రోగులకు ఆక్సిజన్ స్థాయి పెంచేందుకు బెలూన్లు ఊదిస్తున్నారు. ఇలా వ్యాధిని మరిచి రోగులు మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు.
కొవిడ్ కేర్ సెంటర్లో క్రీడలు... సంతోషంలో రోగులు - క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న రోగులు
చదరంగం, వాలీబాల్, షటిల్, రింగాట తదితర క్రీడలతో.. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హోరెత్తుతోంది. వారి ఆటల వీడియోలను కుటుంబసభ్యులకు పంపించి ఆనంద పడుతున్నారు. ఈ కరోనా కష్ట కాలంలో అంత ఉల్లాసంగా గడుపుతున్న వారెవరో కాదు.. కొవిడ్ బాధితులు. స్థానిక అధికారులు ఇచ్చిన మనోధైర్యంతో వ్యాధిని మరిచి ఉత్సాహంగా సేద దీరుతున్నారు.

కొవిడ్ కేర్ సెంటర్లో క్రీడలు
ఆటపాటలతో ఆనందంగా కొవిడ్ బాధితులు
జిల్లా సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్ సైతం ఇటీవల రోగులతో వాలీబాల్ ఆడి మనో ధైర్యాన్ని నింపారు. వారి ఆటలను చరవాణుల్లో బంధించి ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపడంతో.. వారు మరింత ఆనందపడుతున్నారు. వైరస్ బాధితుల కోసం.. గిరిజన ఆశ్రమ పాఠశాలను కొవిడ్ కేంద్రంగా మార్చారు. చుట్టుపక్కల ఆరు మండలాల నుంచి దాదాపు 180 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: