కొవిడ్ కాంట్రాక్టు వైద్యలకు.. ప్రభుత్వం ఆరు నెలల పాటు విధులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అపాయింట్మెంట్ ప్రకారం ఆరు నెలలు పూర్తి కాకుండానే విధుల నుంచి తొలగించారంటూ.. విజయనగరంలో తాత్కాలిక వైద్యులు మహారాజా ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు.
6 నెలల వరకు తమ సర్వీసుని కొనసాగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన తమను.. అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.