ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం... చెత్త బండిలో ఆసుపత్రికి కరోనా బాధితులు

పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో కరోనా అనుమానితుడిని చెత్తబండిలో ఆసుపత్రికి తరలించిన ఘటన మరవకముందే అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో జరిగింది. కరోనా సోకిన ముగ్గురిని మున్సిపాలిటీకి చెందిన చెత్త ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

corona victims in muncipality auto
corona victims in muncipality auto

By

Published : Aug 2, 2020, 10:13 PM IST

Updated : Aug 2, 2020, 10:51 PM IST

మరో దారుణం... చెత్త బండిలో ఆసుపత్రికి కరోనా బాధితులు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జర్జాపుపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు కరోనా బాధితులను చెత్త ఆటోలో తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆందోళన చెందిన బాధితులు... వెంటనే తమను ఆసుపత్రికి తరలించాలని గ్రామ పెద్దలను ఆశ్రయించారు. 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు, గ్రామ పెద్దలు సమకూర్చిన చెత్త ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కలిచి వేస్తోంది.

Last Updated : Aug 2, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details