విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో కరోనా బారిన పడ్డ గర్భిణిల కోసం ప్రత్యేక వార్డు కేటాయించారు. అయితే అందులో 30 పడకలు మాత్రమే ఉన్నాయి. కొవిడ్ బాధితులు 57 మంది ఉన్నారు. బెడ్లు సరిపోక ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురిని ఉంచుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజును వివరణ కోరగా.. పాజిటివ్ వస్తున్న గర్భిణుల సంఖ్య అధికంగా ఉందని.. వారికి తగిన ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని తెలిపారు.
కాబోయే అమ్మకు 'కరోనా' కష్టం - విజయనగరంలో కరోనా బారిన పడ్డ గర్భిణిల వార్తలు
వారంతా కాబోయే అమ్మలు.. కరోనా బారిన పడ్డారు.. ప్రభుత్వం వారికోసం ప్రత్యేక వార్డు కేటాయించింది. అయితే పడకలు సరిపోక ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన పరిస్థితి విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో నెలకొంది.

కరోనా బారిన పడ్డ గర్భిణిలు