విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో మూడు రోజులుగా కరోనా బారిన పడినవారిని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు పేరుకే ఉన్నారని మండిపడ్డారు. పోలీసులు నామమాత్రంగా వచ్చిపోతున్నారని, ఆరికతోట ప్రభుత్వాసుపత్రి వైద్యులకు తెలిపినా...కనీసం స్పందించడం లేదని, 108కి ఫోన్ చేసినా సంబంధం లేనట్లుగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కరోనా బాధితులను ఆదుకోవాలని...పాతరేగు గ్రామస్థులు ఆరికతోట బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిని వెంటనే క్వారెంటెన్ కు పంపాలని కోరుతున్నారు.
కరోనా బాధితులను క్వారంటైన్‌కు తరలించాలి - కరోనా వార్తలు
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం, పాతరేగ గ్రామంలో మూడు రోజులుగా కరోనా బారిన పడినవారిని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా బాధితులను క్వారంటైన్‌కు తరలించాలని ఆరికతోట బైపాస్ రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
కరోనా బాధితులను క్వారంటైన్‌కు తరలించాలి