ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా - Corona for 20 students at vizainagaram district

విజయనగరం జిల్లా గంట్యాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగసాయి.. డీఈవో నాగమణికి రాతపూర్వకంగా తెలియజేశారు.

గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా
గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా

By

Published : Oct 3, 2020, 5:18 PM IST

విజయనగరం జిల్లా గంట్యాడలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. గత నెల 21 నుంచి 9,10 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతికి చెందిన 73 మంది విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది గత నెల 30న కరోనా పరీక్షలు నిర్వహించారు.

20 మందికి కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చినట్లు వైద్య సిబ్బంది నిర్ధరించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగసాయి... డీఈవో నాగమణికి రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details