ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిపుత్రులను వెంటాడుతున్న కరోనా భయం - విజయనగరంలో కరోనా కేసులు

ప్రపంచమంతా కరోనా వ్యాప్తితో అల్లాడుతోంది. మన దేశంలోనూ కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు చేపట్టినా అవి గిరిజనుల వరకు చేరట్లేదు. విజయనగరం జిల్లాలోని గిరిజనులు ఆకులనే మాస్కులుగా చేసుకుని పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నారు.

corona-fear-in-vizayanagaram-rural
corona-fear-in-vizayanagaram-rural

By

Published : Apr 20, 2020, 11:28 AM IST

గిరిపుత్రులను వెంటాడుతున్న కోరనా భయం

అడవితల్లి నీడలో ప్రశాంత జీవనం సాగించే గిరిపుత్రులనూ కరోనా వెంటాడుతోంది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, కంచరపాడు గ్రామంలో వెనుకబడి ఉన్న గిరిజనులకు ఆకులే మాస్కులయ్యాయి. అడవిలో దొరికే ఆకులతో మాస్కులను తయారు చేసుకుని, ఇంటి వద్దనే ఉంటూ తమ పనులను చేసుకుంటున్నారు. వేసవికాలంలో పండే చింత బొట్లను ఏరుకొని.. ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు గిరిజనులు.

లాక్​డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఆకులనే మాస్కులుగా వాడుతున్నారు. ఆకుల్లో ఉండే ఔషధాలు వైరస్ బారిన పడకుండా ఉపయోగపడతాయని వారు అంటున్నారు. ఇక్కడ లభించే మూలికలలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ శక్తి ఉంటుందని వారి నమ్మకం.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు గిరిజనుల దాకా చేరట్లేదు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా మరో 44 కేసులు నమోదు.

ABOUT THE AUTHOR

...view details