ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్... వైద్య సిబ్బందికీ తప్పని తిప్పలు - vizianagarm latest news

విజయనగరం జిల్లాలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు దాటలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా... ఓ వైద్యాధికారి వేగావతి దాటడానికి ఇబ్బందిపడ్డారు.

corona effect on vizianagaram
వైద్య సిబ్బంది అవస్థలు

By

Published : Sep 4, 2020, 7:00 PM IST

విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి… అటు గ్రామాల్లోని వారినే కాదు. గ్రామాల్లోకి వెళ్లి సేవలందించే వైద్య సిబ్బందికి చిక్కులు తెచ్చిపెడుతుంది. తాజాగా ఇదే సమస్య ఎదుర్కొన్నారు బాగువలసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి. చిన్నపారన్న వలసలో కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పెద్దపారన్నవలసకు వెళ్లేందుకు వేగావతి దాటాల్సి ఉంది.

అయితే... కాజ్​వే గాని, వంతెన గాని లేవు ఇక్కడ. పెద్దపారాన్నవలసలో సుమారు పది మంది వరకు నది దాటి రాలేని వృద్ధులు ఉన్నారు. వారికి పరీక్షలు చేసేందుకు వైద్య సిబ్బంది తప్పనిసరై వెళ్లాల్సి ఉంది. చివరికి.. వైద్యాధికారిణి అభిజ్ఞ... ఆ నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లి ఆ గ్రామంలోని వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details