విజయనగరం జిల్లాలో 24 గంటల్లో 3 వేల కోవిడ్ పరీక్షలు చేశామని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ ద్వారా 168 మందికి, ర్యాపిడ్ ద్వారా 2437, ట్రూనాట్ ద్వారా 401 మందికి టెస్టులు నిర్వహించామని ఆయన అన్నారు.
జిల్లాలో 5, 348 కరోనా కేసులున్నాయని.. వీరిలో 1149 మంది కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో 3200 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. 24 గంటల్లో 3 మృతి చెందారని తెలిపారు. జిల్లాలో 8 కోవిడ్ ఆసుపత్రుల్లో 1415 బెడ్లు ఉన్నాయని అన్నారు.