విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామంలో 26 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా 11 మందికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు పీహెచ్సీ సిబ్బందికీ వైరస్ సోకింది. వీరిలో 9 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
మరోవైపు.. మామిడిపల్లి వీఆర్వోకి కరోనా సోకింది. మొత్తంగా సాలూరు మండల పరిధిలో 12 కేసుల నమోదు కారణంగా.. ప్రజలు భయపడుతున్నారు. రోజు రోజుకూ కేసులు పెరగుతున్న పరిస్థితుల్లో అధికారుల ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు.