మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్లో నిలిచిన విజయనగరం జిల్లాలోనూ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందింది. ఫలితంగా ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజు మూడు కేసులు రాగా... ఇవాళ మరోకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు జిల్లాలో వెలుగుచూసిన నాలుగు కేసులు కూడా వలస కార్మికులకు చెందినవి కావటం గమనార్హం. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మెుదలైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై పటిష్ఠ చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు వెలుగు చూసిన గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తోంది. విజయనగరం జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు... కొవిడ్-19 వైరస్ నియంత్రణ చర్యలపై మరింత సమాచారం ఈటీవీభారత్ ప్రతినిధి అందిస్తారు.
కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు
ఇప్పటివరకు గ్రీన్జోన్లో ఉన్న విజయనగరంలో ఒక్కసారిగా కరోనా కేసులు నమోదవటంతో... జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.
కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు