కరోనా జాడ లేని జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న కలెక్టర్, ఎస్పీ బొమ్మలను గోడలపై వేస్తున్నారు లెటరింగ్ ఆర్టిస్టులు. అలాగే.. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లను ధరించాలని ప్రజలకు కరోనా వ్యాప్తి పై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టిస్టులంతా కలిసి కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు తమ వంతు సహాయాన్ని అధికారులకు అందిస్తున్నారు.
లెటరింగ్ కళతో కరోనాపై ప్రజలకు అవగాహన - విజయనగరంలో కరోనా కేసులు
విజయనగరం లెటరింగ్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి నివారణ గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల చిత్రాలను గోడలపై గీస్తున్నారు.
corona awareness programs