విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శివరామపురంలో మొక్కజొన్న రైతులు ఆందోళన చేశారు. 150 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో చిన్న పారన్ వలస, పెద్ద పారన్ వలస, రంగడి వలస రైతులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మిగిలిన రైతులు తమ ఉత్పత్తులతో సాలూరు పట్టణ గోదాముకు తరలిరావటంలో గందరగోళం నెలకొంది. తమ పంటను ఎందుకు కొనుగోలు చేయరని అధికారులతో రైతలు వాదనకు దిగారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని వాపోయారు. 150 మెట్రిక్ టన్నుల వరకే కొనుగోలు చేయాలని ఆదేశాలోచ్చాయని అధికారులు తెలిపారు. అందరు రైతులకు న్యాయం జరిగేలా మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామన్నారు.
సాలూరులో మొక్కజొన్న రైతుల ఆందోళన
విజయనగరం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న పంటతో గోదాముకు వెళ్లిన రైతులు తమ పంటను ఎందుకు కొనుగోలు చేయరని అధికారులతో వాదనకు దిగారు. 150 మెట్రిక్ టన్నుల వరకే కొనుగోలు చేయాలని ఆదేశాలోచ్చాయని అధికారులు తెలపడంతో రైతులు ఆందోళనకు దిగారు.
మొక్కజొన్న రైతుల ఆందోళన