ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగదు పంపిణీలో వివాదం..ఇరు వర్గాల ఘర్షణ - బంగార్రాజుపేటలో నగదు పంపిణీలో వివాదం

కరోనా కారణంగా ప్రభుత్వం పేదలకు నగదు పంపిణి చేస్తున్న కార్యక్రమంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంగార్రాజుపేటలో వైసీపీ, తెదేపా కార్యకర్తల మధ్య వివాదం జరిగింది.

Controversy in the distribution of cash
నగదు పంపిణీలో వివాదం

By

Published : Apr 5, 2020, 7:24 PM IST

నగదు పంపిణీలో వివాదం

విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంగార్రాజుపేటలో కరోనా కారణంగా ప్రభుత్వం పేదలకు నగదు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో వైసీపీ, తెదేపా కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. ప్రభుత్వం ఆర్థికసాయం నగదు పంపిణీ అందజేసేందుకు బియ్యం కార్డుదారుల ఇళ్లకు గ్రామ వాలంటీరు కొయ్య శ్రీను, వైకాపా కార్యకర్తలు వెళ్లారు. తన ఇంటికి గుంపుగా వచ్చిన వారిని చూసిన తెదేపా నేత సత్యనారాయణరెడ్డి కరోనా ముప్పు ఉన్నందున ఎక్కువమంది కలిసి రాకూడదని అడ్డుకున్నారు. వారి మధ్య మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో సత్యనారాయణకు చేతికి గాయాలయ్యాయి. తమపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తండ్రీకొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

చెట్టు నువ్వెక్కుతావా.. మమ్మల్నే ఎక్కమంటావా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details