ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం మన్యంలో మృత్యుఘోష - unknown disease at vijayanagara.

విజయనగరం మన్యంలోని పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేంలో అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే వింత వ్యాధితో గూడెం ప్రజలు వరుసగా మరణించారు. మద్యం తాగడం వల్లా లేక క్రిమి కారణంగా చనిపోతున్నారో అంతుచిక్కలేదు.

unknown disease at vijyanagaram tribal
విజయనగరం మన్యంలో మృత్యుఘోష

By

Published : Nov 19, 2020, 7:20 AM IST

విజయనగరం మన్యంలోని పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేనికి చెందిన పలువురు గిరిజనులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. వింత వ్యాధి బారినపడి మరణిస్తున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి పరిస్థితిని తెలియజేశారు. గూడేనికి చెందిన ముఖి వెంకటి(55), ముఖి పెద్దమ్మి(45), సింబోయిన సింహాచలం, ముఖి అమ్మన్న, ముఖి కోతాయ్య, ముఖి గంగమ్మ, ముఖి అప్పలస్వామి, సింబోయిన చిన్నయ్య కొన్నిరోజుల్లోనే వరుసగా మరణించారని తెలిపారు. వెంటనే స్పందించాలని అధికారులను కోరారు. వ్యాధి లక్షణాల బట్టి మద్యం, మండి కల్లు తాగడం వల్ల శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి చనిపోతున్నారని గురివినాయుడుపేట పీహెచ్‌సీ వైద్యుడు ఎస్‌.రవిశంకర్‌ తెలిపారు. అయితే అది ఏ వ్యాధో నిర్ధారించాల్సి ఉందని, ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details