ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chintha Mohan: విద్యార్థులు చదువుకోవటం ఇష్టం లేదా ?: చింతా మోహన్ - విజయనగరం వార్తలు

రోజురోజుకూ నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు వచ్చే ఉపకార వేతనం రాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

Chintha Mohan
విద్యార్థులు చదువుకోవటం ఇష్టం లేదా ? -చింత మోహన్

By

Published : Nov 2, 2021, 1:50 PM IST

దేశంలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని విజయనగరంలో వాపోయారు.

దేశమంతా విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఆపడం దుర్మార్గమన్నారు. రెండున్నర ఏళ్లుగా కేంద్రం ఇస్తున్న స్కాలర్ షిప్ మొత్తాలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. దీపావళిలోగా విద్యార్ధులకు స్కాలర్ షిప్​లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులు చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ఆర్ధిక చేయూత కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు నామమాత్రంగా మారటంపై చింతమోహన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details